Astro Science | Lalkitab Amrit | Yantra | Matchmaking
New Page 1

యంత్రము

మెడ లో ధరించవలసిన యంత్రాలు

సర్వత్రా సిద్ధి యంత్రము
రోగనివారణ యంత్రము
సకల సౌభాగ్యయంత్రము
రుణవిమోచన యంత్రము
అష్టాసిద్ధి యంత్రము
సకల కార్యసాధకాయంత్రము
సంతానప్రాప్తి యంత్రము
విద్య బుద్ధి వృద్ధి యంత్రము
శంకట నివారణయంత్రము
సర్వ రక్షక యంత్రము



మన పురాతన కాలంలోని చిత్రాలు,ఆకారాలు,చిహ్నాలు అన్ని కూడా వారివారి దేవుడిని ప్రతిబింబిస్తాయి . అంతే కాకుండా ఈ చిహ్నాలకు, ఆకారాలకు మంత్రాలు కూడా చదివేవరు. వేదా కాలంలో ఈ యొక్క చిహ్నాలకు , ఆకారాలకు చాలా శక్తి మరియు బలం ఉండేవని ప్రజలు విశ్వాసించేవారు . ఈ యంత్రాలను మనకు మనమే పెట్టుకోవడం వేసుకోవడం వల్ల ఏ విధమైన ఫలితం ఉండదు. ఈ యంత్రాలను తయారు చేయడనీకి గొప్ప నైపుణ్యము, జ్ఞానము ఉండాలి అంతే కాకుండా వీటి పై నమ్మకం ఉన్నపుడే మనము అనుకున్న కోరికలు నెరవేరుతాయి.

యంత్రము అంటే ఒక తాయత్తు లేదా సాధనము లేదా కావచాము. ఈ యంత్రాన్ని సాధారణంగా గొప్ప మేధావులు నైపుణ్యం గల వ్యక్తులు తయారు చేస్తారు, అంతే కాకుండా ఈ యంత్రాన్ని ఎవరైతే తయారుచేస్తారో ఆ వ్యక్తి చెప్పిన సలహాలను ,సూచనలను అనుసరించి ఉపయోగించవలసి ఉంటుంది. అప్పుడే మనము ఆ యంత్రం ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలను పోందుతాము . ఈ యంత్రాన్ని ఉపయోగించడం చాలా సులభం .దీని వల్ల మనకు సమస్యలు రావు. అంతే కాకుండా దీని వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది . ఒక వేళ ఈ యంత్రాలను కనుక సరియైన వ్యక్తి తయారుచేయనట్లయితే , ఆ వ్యక్తి చేసిన యంత్రాల వల్ల ఏ విధమైన ప్రయజనం ఉండదు.

యంత్రాన్ని తయారు చేసేటప్పుడు కొన్ని నియమనిబందనలకు లోబడి తయారుచేయవల్సి ఉంటుంది. ఒక వేళ యంత్రాన్ని పేపర్ పైన చేసినట్లయితే ఎరుపు,పసుపు,కాషాయం రంగులతో గాని లేదా ఈ రంగుల కలయికతో గాని తయారుచేస్తారు. బిజాక్షరాలు లేనిదే ఏ యంత్రాలను తయారుచేయలేరు. యంత్రము ఒక నిర్ణీత ఆకారము ,పరిమాణాన్ని కల్గి ఉంటుంది . యంత్రాన్ని తయారు చేసిన తరువాత దానికి పూజా చేయవలసి ఉంటుంది ,అప్పుడే దానికి ప్రాణం (ప్రణప్రతిష్ట) వస్తుంది. ఈ యంత్రము , మీ జీవితంలో అన్ని విషయాలలో ఉపయోగపడుతుంది ఆది ఎలాగంటే , మీ వృత్తిలో మీరు విజయం సాదించవచ్చు,మంచి ఆరోగ్యం పొందవచ్చు, కోర్ట్ కేసులు గెలవవచ్చు,మీ అనారోగ్య సమస్యలను తగించవచ్చు . ఈ యంత్రాన్ని మీ ఇంటిలో ఒక ప్రదేశంలో ఉంచి , రోజు దానికి పూజలు చేయండి . దీని వల్ల మీ కోరికలు నెరవేరుతాయి మరియు జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.

ఈ యంత్రాలు అనేక రకాలు మరియు వివిధ రకాల ఉద్దేశాల కోసం నిర్దేశించబడినవి . దీని వల్ల మీరు వ్యాపారంలో వృద్ది సాధిస్తారు,వ్యక్తులను మీ అధీనంలోకి తెచ్చుకుంటారు,మీకు సంతోషము మరియు సుఖము రెండు లభిస్తాయి . ఈ యంత్రాలు మీపై చాలా క్రియాశీలకమైన పాత్రను పోషిస్తాయి . మహశివరాత్రి, దీపావళి, హోలీ,రోజులలోని రాత్రులలో ఈ యంత్రాలు చాలా శక్తిని మరియు తీవ్రప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఈ యంత్రాలకు సంబందించిన శ్లోకాలను గాని మంత్రాలను గాని చదివినట్లయితే అవి మరింత తొందరగా మీ పై ప్రభావాన్ని చూపుతాయి.

ప్రతి రోజు ఈ యంత్రాల ముందు ధూపాముతో గాని, ఆవు నెయ్యితో గాని దీపం వెలిగిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది . దీని వల్ల మీరు అన్ని విషయాలలో విజయాన్ని మరియు సంతోషాన్ని పోందుతారు . ఈ యంత్రాలను మేము పూజా ప్రణప్రతిష్ట ను చేసిన తరువాత నే పంపిస్తాము.